ప్రభుదేవా, తమన్నా కాంబినేషన్‌లో తమిళ డైరెక్టర్ ఎఎల్. విజయ్ దర్శకత్వంలో
తెకెక్కుతున్న త్రిబాషా చిత్రం(తెలుగు, తమిళం, హిందీ) 'అభినేత్రి'. ఈ సినిమాను మూడు
భాషల్లో వేర్వేరు టైటిల్స్ తో రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి తెలుగులో 'అభినేత్రి'
అనే టైటిల్ ఫిక్స్ చేయగా... తమిళంలో 'డెవిల్' పేరుతో, హిందీలో 'టూ ఇన్ వన్' పేరుతో
రిలీజ్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ 'అభినేత్రి'కి ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాతగా
వ్యవహరిస్తుండగా, తమిళ వర్షన్ ను ప్రభుదేవా, హిందీ వర్షన్ ను సోనూసూద్ లు నిర్మిస్తున్నారు.
తెలుగు వెర్షన్ 'అభినేత్రి' చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక ఆదివారం హైదరాబాద్ లో
గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్ స్టేజీపై డాన్స్ చేసి
అభికులను ఎంటర్టెన్ చేసారు. కోన ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై
ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్ కార్పొరేషన్, బి.ఎల్.ఎన్. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని
తెలుగులో నిర్మిస్తున్నారు. సాజిద్-వాజిద్, విశాల్ సంగీతం అందించిన ఆడియో రిలీజ్
వేడుకలో ప్రభుదేవా, తమన్నా, రకుల్‌ప్రీత్ సింగ్, సోనూసూద్, కొరటాల శివ, క్రిష్,
ఎ.ఎల్.విజయ్, నందినీ రెడ్డి, కోనవెంకట్, రాజ్ తరుణ్, రామజోగయ్యశాస్త్రి, శివ తుర్లపాటి,
అరుణ్ వడ్డేపల్లి, నాని, శ్రీవాస్, పివిపి, సాజిద్-వాజిద్, ఎం.వి.వి.సత్యనారాయణ,
డి.వి.వి.దానయ్య, అభిషేక్ పిక్చర్స్ అభిషేక్, బి.వి.ఎస్.రవి తదితరులు పాల్గొన్నారు.
credit/source: telugu.filmibeat






No comments:
Post a Comment