కాకినాడ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో తన
చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై ఎవరికీ
సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్న వెంకయ్య... హోదాకు మించిన సాయం ఏపీకి
కేంద్రం చేస్తుందని పునరుద్ఘాటించారు.
రాజకీయ పరిజ్ఞానం ఉన్న
అందరికీ తెలుగువారి కోసం తాను చేస్తున్న కృషి అర్థం అవుతుందని అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం మొదట పట్టుబట్టింది తానొక్కడినేని వెంకయ్య
అన్నారు. ఇప్పుడు హోదాపై మాట్లాడుతున్నవారు అప్పుడు ఏం చేశారని
ప్రశ్నించారు. తాను కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఏపీకి
చేయాల్సిన సాయం చేస్తూనే ఉన్నానన్నారు. తనకు ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదని
అన్నారు.
Source/Credit: Facebook
Source/Credit: Facebook

No comments:
Post a Comment