సాధారణంగా పెళ్లైన తర్వాత సినిమాలు మానేస్తారు హీరోయిన్స్. ఒకవేళ చేసినా చాలా పద్ధతిగా ఉండే క్యారెక్టర్లలోనే కనబడతారు. అయితే అందాల తార ఐశ్వర్యరాయ్ రూటే సెపరేటు. పెళ్లవ్వడమే కాదు.. ఓ కూతురికి తల్లైన తర్వాత కూడా ఐష్ అదరొగొట్టే శృంగార సన్నివేశాల్లో నటించింది.
'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా ప్రమోషన్‌లో భాగంగా 'బులయ్యా' అంటూ సాగే ఓ పాట వీడియోను విడుదల చేశారు. ఇందులో హీరో రణ్‌బీర్‌కపూర్‌తో కలిసి ఐష్ అద్భుతమైన కెమిసీ్ట్ర పండించింది. మరో విశేషమేమిటంటే ఆ వీడియో చూసిన వారు ఐశ్వర్య వయసు 42 ఏళ్లని, ఆమె ఓ బిడ్డకు తల్లనే విషయాన్ని కూడా మర్చిపోతారు. పాతికేళ్ల వయసులో ఉన్న ఐశ్వర్య గుర్తుకురావడం ఖాయం.
ఆ పాటలో
రణ్‌బీర్‌తో ముద్దు సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్లు ఉన్నాయి. ఈ ప్రోమోలో ఉన్నది
కేవలం శాంపిల్ మాత్రమేనని, అక్టోబర్ 28న విడుదల కాబోయే సినిమాలో రణ్‌బీర్, ఐష్
ఆన్‌స్ర్కీన్ రొమాన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతారని అంటున్నారు దర్శకనిర్మాతలు. ఈ
సినిమాలో ఐశ్వర్యతోపాటు అనుష్క శర్మ కూడా నటిస్తోంది. అయితే ప్రస్తుతానికి అనుష్క
గురించి పెద్దగా రివీల్ కాలేదు.
మొత్తానికి ఆ వీడియో చూసిన వారందరూ అనుకునే మాట ఒకటే.. 'ఐష్ ఈజ్
బ్యాక్'అని.
credit/source: http://m.dailyhunt.in/
No comments:
Post a Comment