మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 చిత్రంలో విజయ్ మాల్య గా నటిస్తున్నట్టు బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా అన్నారు. తమిళంలో నీల్ నితిన్ ముఖేష్ చేసిన ఆ పాత్రను.. తెలుగులో తరుణ్ అరోరా చేయబోతున్నాడు. తెలుగులో తొలిసారి నటించే అవకాశం దక్కినందుకు సంతోషం వ్యక్తం చేశాడతను. తమిళంలో కంటే తెలుగులో ఈ విలన్ పాత్ర టేకింగ్ కాస్త భిన్నంగా ఉంటుందని అరోరా చెప్పాడు. ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్ తో చేయబోతున్నట్టు తెలిపాడాయన. ఈ సినిమాలో తన నటన మొత్తం విజయ్ మాల్య తరహా సూట్లలోనే కనిపిస్తానని అన్నారు. విజయ్ మాల్యా లైఫ్ స్టైల్ తన పాత్రలో ప్రతిబింబిస్తుందని తెలిపారు.
చిరంజీవితో
కలసి చేసిన సన్నివేశాలు చాలా తక్కువని తెలిపారు అరోరా. వీవీ వినాయక్ దర్శకత్వంలో రామ్
చరణ్ నిర్మాతగా వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. దర్శకుడు
వినాయక్ కూడా చాలా ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ సినిమాలో చాలా వరకు యంగస్టర్స్
ఎక్కువగా ఉన్నట్టు తెలిపాడు.
credit/source: http://telugu.v6news.tv
No comments:
Post a Comment