aad

Breaking News
recent

శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటే మిరియాలతో చేసిన టీ .....

ఆరోగ్యకర పద్దతిలో శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటే మిరియాలతో చేసిన టీ తాగటం చాలా మంచిదని చెప్పవచ్చు. శరీర బరువు తగ్గించుకోటానికి పాటించే ప్రణాళికలో ఈ టీని కలుపుకోవటానికి కారణాలు మరియు దీని వలన కలిగే ఇతర ప్రయోజనాల గురించి కింద క్లుప్తంగా వివరించబడింది. 

పలు అధ్యయనాలు, మిరియాలతో చేసిన టీ శరీర బరువును శక్తివంతంగా పని చేస్తుందని కనుగొన్నారు. కానీ, కేవలం మిరియాల టీ తాగటం వలన శరీర బరువు తగ్గదు, ఈ టీ తీసుకోవటంతో పాటుగా, నియంత్రిత ఆహార పదార్థాల సేకరణతో పాటు, భౌతిక కార్యాలను అనుసరించాలని సూచించారు. శరీర బరువు తగ్గించుకోవాలనుకునే వారు వారు పాటించే ప్రణాళికలలో మిరియాల టీ ని తప్పక కలుపుకోండి.


ఆకలిని అణచివేస్తుంది

గాడమైన లేదా గాటైన వాసన కలిగి ఉండే మిరియాల టీ ఆకలిని అణచివేస్తుంది అనగా, ఆకలిని అనిపించకుండా చూస్తుంది. స్వీట్లు లేదా అధిక క్యాలోరీలు గల భోజనాలు తినటానికి ఇష్టపడుతున్నారా! అయితే, వీటికి బదులుగా మిరియాల టీ తాగండి.


జీర్ణశయాంతర చలనాన్ని పెంచుతుంది

మిరియాలతో చేసిన టీ, కొవ్వు పదార్థాలు జీర్ణమవటాన్ని పెంచి, మల ప్రవాహాన్ని పెంచుతుంది. అనగా, జీర్ణశయాంతర చలనాలను పెంచి, అజీర్ణం మరియు మలబద్దకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.


గుండె ఆరోగ్యానికి మంచిది

చేపలో ఉన్నట్టుగా, మిరియాలతో చేసిన టీలో కూడా ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.


విశ్రాంతి చేకూరుస్తుంది

ప్రతి రోజు పెరిగే ఒత్తిడి వలన శరీర జీవక్రియపై ప్రతికూల ప్రభావం కలగవచ్చు ముఖ్యంగా బరువు తగ్గించుకోవాలనుకునే సమయంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన ఒత్తిడిని మిరియాల టీ తాగటం ద్వారా తగ్గించుకోవచ్చు. సూతింగ్ ఎఫెక్ట్ కలిగి ఉండే మిరియాల టీ, శరీర వ్యవస్థలను విశ్రాంతికి గురి చేసి, ఒత్తిడిని తగ్గించి, శరీరాన్ని తిరిగి గాడిలో పడేలా చేస్తుంది.


విటమిన్ 'C'ని అధికంగా కలిగి ఉంటుంది

మిరియాలతో చేసిన టీ విటమిన్ 'C'ని కూడా పుష్కలంగా కలిగి ఉంటుంది. ఈ విటమిన్ వైరస్ మరియు బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని శరీర రోగ నిరోధక వ్యవస్థకు చేకూర్చటమేకాకుండా, జీవక్రియ సజావుగా, సాధారణ స్థాయిలో జరిగే విధంగా ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యకర రోగ నిరోధక వ్యవస్థ మరియు జీవక్రియలు శరీరంలో కొవ్వు పదార్థాల నిల్వను నివారించి, బరువు తగ్గుటను ప్రోత్సహిస్తాయి.



click below for more
credit/source: http://telugu.onlymyhealth.com/
Happy Day

Happy Day

No comments:

Post a Comment

Powered by Blogger.