ఎర్ర మిరప అనేది, శరీర బరువు తగ్గించే ప్రాముఖ్యం పొందిన సహాజ ఔషదంగా పేర్కొనవచ్చు. దీనిలో ఉండే "క్యాప్సైసిన్", 'థర్మోజెనిక్' గుణాలను కలిగి ఉండి, శరీర ఉష్ణోగ్రతలను పెంచి మరియు జీవక్రియ స్థాయిలను రెట్టింపు చేస్తుంది. ఒక అరచెంచా ఎర్ర మిరప, శరీరంలో వినియోగించబడే క్యాలోరీల స్థాయిలను పెంచటమేకాకుండా, ఆకలిని కూడా నియంత్రిస్తాయి. ఈ విధంగా ఎర్ర మిరప బరువు తగ్గించటమేకాకుండా, దీనిలో ఉండే 'క్యాప్సైసిన్' జీర్ణక్రియ ప్రక్రియను కూడా మెరుగుపరుస్తాయి.
ఎర్ర మిరప అనగా ఏమిటి?
ఎర్ర మిరపలోని ప్రధాన క్రియాత్మక సమ్మేళనం- "క్యాప్సైసిన్". థర్మోజెనిక్ గుణాలను కలిగి ఉండే ఈ సమ్మేళనం, శరీర జీవక్రియ రేటును పెంచటమే కాకుండా, ఆకలిని తగ్గించుటలో సహాయపడుతుంది.
ఎర్ర మిరప పూర్తి ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది?
ఎర్ర మిరపని చాలా ప్రదేశాలలో అద్భుతమైన ఔషదంగా భావిస్తారు. ఎర్ర మిరప శరీర బరువు తగ్గించటమేకాకుండా, పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిని మీ ఆహార ప్రణాళికకు కలుపుకోవటం వలన శరీర వ్యవస్థలు సరిగ్గా నిర్వహించబడటమే కాకుండా, రక్త ప్రసరణ రేటు కూడా అధికం అవుతుంది. అంతేకాకుండా, లైంగిక వాంఛ పెరగటం, జీర్ణప్రక్రియ పెరగటం, అల్సర్ వంటివి తగ్గటం మరియు రక్తపోటు కూడా ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించబడుతుంది.
ఎర్ర మిరపని ఎపుడు కలుపుకోవాలి
ఎర్ర మిరపని ఎక్కువగా తీసుకోవాలి అనుకుంటున్నారా! అయితే మీ ఆహరంలో మాత్రమే కలుపుకోండి. ఇలాంటి ఆరోగ్యకర ఆహర సేకరణకు వ్యాయామాలు తప్పని సరి. బలాన్ని చేకూర్చే శిక్షణతో పాటు, వారంలో 3 నుండి 5 సార్లు కార్డియో వ్యాయామాలను తప్పక అనుసరించాలి.
కొంతమంది అభిప్రాయం ప్రకారం, ఎర్ర మిరప అనేది శరీర బరువు తగ్గించుకోటానికి మంచి మార్గం గానూ, ఈ ఎర్ర మిరపని ఒక గ్లాసు గ్రీన్ టీలో కలుపుకొని తాగాలని వారు సూచించారు.
ఎర్ర మిరప వాడకం ద్వారా బరువు తగ్గించుకోవటంలో మొదట ఫలితాలు స్వల్పంగా ఉంటాయని, ఆకలిని తగ్గించి, జీవక్రియను వేగవంతం చేసి, బరువు తగ్గుటను మీరు గమనించవచ్చు.
click below for more
credit/source: http://telugu.onlymyhealth.com/

No comments:
Post a Comment